News2nd Apr 01:43 PMSunil Byrisetty1 min read
2027లో నాసిక్ కుంభమేళా
ఇటీవల జరిగిన మహాకుంభమేళా దాదాపు 50 కోట్ల మంది సందర్శనతో రికార్డు సృష్టించింది. ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా జరిగిన ఆ మహాకుంభమేళా స్ఫూర్తితో నాసిక్ కుంభమేళాను నిర్వహించబోతున్నారు.
ఇటీవల జరిగిన మహాకుంభమేళా దాదాపు 50 కోట్ల మంది సందర్శనతో రికార్డు సృష్టించింది.
ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా జరిగిన ఆ మహాకుంభమేళా స్ఫూర్తితో నాసిక్ కుంభమేళాను నిర్వహించబోతున్నారు.
144 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళా గిన్నిస్ ప్రపంచ రికార్డులకూ ఎక్కింది.
ఈ నేపథ్యంలో 2027 జూలై 14 -సెప్టెంబర్ 25 మధ్య మహారాష్ట్రలోని నాసిక్‌లోని గోదావరి నది ఒడ్డున కుంభమేళా జరగనుంది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరగబోతోంది.
దీనికి 'త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళా'గా నామకరణం చేయనున్నారు.
ఇటీవల మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ కుంభమేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు త్రయంబకేశ్వరున్ని సందర్శించారు.
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాను దర్శించుకోలేకపోయిన వాళ్లు ఈ నాసిక్ కుంభమేళాకు తరలి రావాలని ప్రచారం చేస్తు్న్నారు.