News21st Apr 12:19 PMSunil Byrisetty1 min read
గొల్లపూడి పంచాయతీకి అవార్డు
పల్లె క్రాంతి విజయవాడ: విజయవాడ రూరల్ గ్రామ పంచాయతీ గొల్లపూడికి జాతీయ అవార్డు పంట పండింది. కేంద్ర ప్రభుత్వ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూ
పల్లె క్రాంతి విజయవాడ: విజయవాడ రూరల్ గ్రామ పంచాయతీ గొల్లపూడికి జాతీయ అవార్డు పంట పండింది.
కేంద్ర ప్రభుత్వ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి గ్రామ పంచాయతీ అవార్డుకు ఎంపికైంది.
జాతీయ పంచాయతీ అవార్డులు- 2025 కింద ఆత్మ నిర్భర్ పంచాయతీ ప్రత్యేక అవార్డు ప్రత్యేక కేటగిరీ అవార్డులో మూడవ ర్యాంక్‌ను సాధించింది.
ఈ ప్రత్యేక అవార్డులు మూడు విభాగాలలో ఎంపిక చేస్తారు.
వాటిలో ఆత్మ నిర్భర్ ఒకటి.
ఆత్మ నిర్భర్ అవార్డులు 3 గ్రామ పంచాయతీలకు సొంత మూల ఆదాయాన్ని (OSR) సమీకరించడం, పెంచడం కోసం ఇవ్వడం జరుగుతుంది.
ఇతర రెండు విభాగాలు క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు, పంచాయత్ క్షమతా నిర్మాణ్ సర్వోత్తం సంస్థాన్ పురస్కారంగా అందిస్తారు