News27th Sep 06:00 PMSunil Byrisetty1 min read

విజయవాడలో నేషనల్ ఆయుర్వేద దినోత్సవం 2కే రన్

ఆరోగ్యమే మహాభాగ్యం.. నిత్య వ్యాయామమే ఆరోగ్యానికి పునాది అనే సందేశంతో నేషనల్ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఆదివారం నిర్వహించిన 2కే రన్ ఉత్సాహభరిత వాతావరణంలో విజయవ

విజయవాడలో నేషనల్ ఆయుర్వేద దినోత్సవం 2కే రన్
ఆరోగ్యమే మహాభాగ్యం.. నిత్య వ్యాయామమే ఆరోగ్యానికి పునాది అనే సందేశంతో నేషనల్ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఆదివారం నిర్వహించిన 2కే రన్ ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఆరోగ్యం, ఫిట్‌నెస్, వెల్‌నెస్, ముందస్తు ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో బీఆర్‌టీఎస్ రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య, ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారు, రోటరీ సభ్యులు, కుటుంబాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్, రోటరీ విజయవాడ మిడ్‌టౌన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 2కే రన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారం, క్రమబద్ధమైన దినచర్య, ముందస్తు ఆరోగ్య సంరక్షణ ఎంతో అవసరమని అన్నారు. నేషనల్ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఆరోగ్యం, వెల్‌నెస్‌పై అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. నడక, పరుగు, క్రమం తప్పని వ్యాయామం వంటి చిన్నచిన్న ఆరోగ్యకరమైన అలవాట్లను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
Scroll for the next article