Agriculture13th Sep 10:41 AMSunil Byrisetty1 min read
ఏపీ ఔషధ మొక్కలు అదరహో!
ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు (ఏపీఎంఏపీ) పనితీరు బాగుందని ఆయుష్ శాఖ, జాతీయ ఔషధమొక్కల బోర్డు ఉప సీఈవో డా. ఖయూమ్ ప్రశంసించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి విజయవాడ
ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు (ఏపీఎంఏపీ) పనితీరు బాగుందని ఆయుష్ శాఖ, జాతీయ ఔషధమొక్కల బోర్డు ఉప సీఈవో డా. ఖయూమ్ ప్రశంసించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్న ఆయన రాష్ట్ర బోర్డ్ సిఈవో ఆవుల చంద్రశేఖర్ కృషిని అభినందించారు. లండన్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును చంద్రశేఖర్ అందుకోవడం స్ఫూర్తిదాయకమని కితాబునిచ్చారు. కార్యాలయంలోని ప్రయోగశాల, హెర్బల్ మ్యూజియమ్, విలువ ఆధారిత సేవలు, విత్తనాల గోడౌన్, పొందుపరిచిన జాబితా, సాగుబడి విధానం, బోర్డు వెబ్ సైట్, మొక్కలకు సంక్రమించే వ్యాధులు, పరిష్కారాలను సూచించే పుస్తకాలను జాతీయ ఉప సీఈవో సమగ్రంగా పరిశీలించారు. అవసరమైన యంత్రాలు, పనిముట్లు, పచ్చదనం, పరిశుభ్రతతో పాటు బోర్డు కార్యాలయ ప్రాంగణాన్ని సుందర నందనవనంగా తీర్చిదిద్దిన అధికారులు, సిబ్బందిని మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పలు వ్యవసాయ క్షేత్రాల్లో ఔషధ, సుగంధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించటం, రైతులకు విలువ ఆధారిత సేవలను అందించడాన్ని తెలుసుకుని ప్రశంసించారు.