Politics30th Jul 09:20 AMSunil Byrisetty1 min read
తల్లి, చెల్లికి ఆస్తుల వ్యవహారం.. జగన్‌కు రిలీఫ్
ఆస్తుల బదలాయింపులో జగన్ కు రిలీఫ్ లభించింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. షేర్ల బదిలీ ప్రక్రియను నిలుపుదల
ఆస్తుల బదలాయింపులో జగన్ కు రిలీఫ్ లభించింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. షేర్ల బదిలీ ప్రక్రియను నిలుపుదల చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి తన కుటుంబ సభ్యులు అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిలిపివేయాలంటూ గత ఏడాది జగన్ పిటిషన్ వేశారు. రిజిస్టర్‌లో వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ కోరారు.
ఇవ్వకుండానే మోసపూరితంగా వాటాల బదలాయింపు జరిగిందని తెలిపారు. వాటాల పత్రాలు, వాటాల బదలాయింపు ఫారాలు సమర్పిస్తేనే కంపెనీ వాటాలను బదలాయించాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలను బదలాయించిందన్నారు. తుది తీర్పు వెలువడేవరకు బదలాయింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జగన్ కోరారు. తాజాగా బదిలీలు సాధ్యం కాదంటూ తీర్పు వెల్లడించారు.