News7th Aug 10:59 AMSunil Byrisetty1 min read
చేనేతల చిరునవ్వు...!
ఆగస్టు 7.. జాతీయ చేనేత దినోత్సవం.. మన దేశంలో 2015 నుంచి ప్రతియేటా ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటాం. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు వారసత్వంగా నిలిచిన చేనేత రంగం క
ఆగస్టు 7.. జాతీయ చేనేత దినోత్సవం.. మన దేశంలో 2015 నుంచి ప్రతియేటా ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటాం. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు వారసత్వంగా నిలిచిన చేనేత రంగం కాలక్రమంలో ఒడిదుడుకులకు లోనవుతున్నా.. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలనేకం వున్నాయి. మన రాష్ట్రంలో వేకువజామున కోడికూత... మగ్గాల సవ్వడితో దినచర్య ప్రారంభమయ్యేది. కాలక్రమంలో చేనేత రంగంలో ఒడిదుడుకులు ఎదురవడంతో ప్రత్యామ్నాయంగా స్వర్ణకార వృత్తిలోకి చేనేత కుటుంబాలు మళ్లాయి. చేనేతల్లో వారసత్వంగా అలవడిన సహనం, ఓర్పు, నైపుణ్యం స్వర్ణకార రంగంలోనూ రాణించేలాచేశాయి. ఇంకనూ చేనేత వృత్తినే కొనసాగిస్తున్న కుటుంబాలు అనేకం వున్నాయి. పొద్దస్తమానం మగ్గం గుంతతో సహవాసం చేసినా రాబడి అంతగా రాకపోవడంతో ప్రభుత్వాలు సహకారం అందించాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. గత ప్రభుత్వం నేతన్న నేస్తం పేరిట చేనేతలకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 71వేల పైచిలుకు చేనేత కళాకారులకు ‘నేతన్నల సేవలో’ పేరిట రూ.25వేలు అందించేందుకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిద్ధమయింది.