News31st May 05:18 PMSunil Byrisetty1 min read
హైవే పనుల్లో నాణ్యతపై మంత్రి బీసీ ఆగ్రహం
ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో జాతీయ రహదారి 340 C పనులను స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో కలిసి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. జాతీయ రహదారి పనుల
ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో జాతీయ రహదారి 340 C పనులను స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో కలిసి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు.
జాతీయ రహదారి పనుల్లో నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేషనల్ హవే 340 C కు ఇరువైపులా నాణ్యత, బలం లేని మట్టిని కాంట్రాక్టర్ వాడటంతో.. కోతకు గురైందన్నారు. గతంలో కూడా ఈ కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు చేయడం జరిగిందన్న మంత్రి విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని ఆదేశించారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రాకపోవడం వెనుక ఎవరున్నారో బయట పెడతామని మంత్రి హెచ్చరించారు.
ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసి, నాణ్యత లేని రోడ్లును నిర్మించే కాంట్రాక్టర్ల విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రే చెప్పారన్నారు.