News29th Jul 09:27 AMSunil Byrisetty1 min read

ఏపీ దివ్యాంగ విద్యార్థుల పతకాల పంట

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. స్పెషల్ ఒలింపిక్స్ భారత్ ఆధ్వర్యంలో జూలై 24 నుండి 28 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో నిర్

ఏపీ దివ్యాంగ విద్యార్థుల పతకాల పంట
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. స్పెషల్ ఒలింపిక్స్ భారత్ ఆధ్వర్యంలో జూలై 24 నుండి 28 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి బోచీ (BOCCE) పోటీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 6 పతకాలు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ పోటీల్లో దివ్యాంగ విద్యార్థులు 1 బంగారు పతకం, 2 వెండి పతకాలు, 3 కాంస్య పతకాలు గెలుచుకున్నారని తెలిపారు. విద్యార్థుల ఈ అద్భుతమైన ప్రదర్శన వారి పట్టుదల, కృషికి నిదర్శనమని కొనియాడారు. ఈ విజయం దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించడానికి ప్రేరణనిస్తుందని తెలిపారు. 1. ఎస్. తన్మయ శ్రీదేవి బంగారు పతకం - 1వ స్థానం - వ్యక్తిగతం 2. వి.చరణ్ తేజ - గుంటూరు, - రజత పతకం - 2వ స్థానం -వ్యక్తిగతం 3. కె.ఎస్.డి పోలరాజు - కాకినాడ - రజత పతకం - 2వ స్థానం - యూనిఫైడ్ పార్టనర్
Andhra Pradesh news
Special Olympics India
Divyang Students
BOCCE Championship
Inclusive Education
Government Schools
National Sports Achievement
B. Srinivasa Rao
Chhattisgarh Bilaspur BOCCE 2024
దివ్యాంగ విద్యార్థులు
బోచీ పోటీలు
ప్రభుత్వ పాఠశాలలు
Scroll for the next article