News31st Oct 04:52 PMSunil Byrisetty1 min read

అంబ‌రాన్నంటిన మ‌హిళా శ‌క్తి సంబ‌రం

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనదయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (DAY-NRLM) ఆధ్వర్యంలో ఏపీ సెర్ప్‌తో క‌లిసి విజ‌య‌వాడ పున్న‌మిఘాట్ వ‌ద్ద 19 రోజులుగా జ‌రు

అంబ‌రాన్నంటిన మ‌హిళా శ‌క్తి సంబ‌రం
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనదయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (DAY-NRLM) ఆధ్వర్యంలో ఏపీ సెర్ప్‌తో క‌లిసి విజ‌య‌వాడ పున్న‌మిఘాట్ వ‌ద్ద 19 రోజులుగా జ‌రుగుతున్న నిర్వ‌హించిన జాతీయ స‌ర‌స్ మేళా-2026 మ‌హిళా శ‌క్తిని చాటిచెప్పింది. ల‌ఖ్‌ప‌తిదీదీల సాధికార‌త‌కు స‌రికొత్త ఊపు తెచ్చింది. గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసానికి, ఆర్థిక స్వావలంబనకు మేళా ఒక విజయవంతమైన వేదికగా నిలిచింది. మేళా ముగుస్తున్న స‌మ‌యంలో శ‌నివారం స‌ర‌స్ ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్,సెర్ప్ డైరెక్ట‌ర్లు చ‌క్ర‌వ‌ర్తి, శివ‌శ‌కంర్, స‌ర‌స్ స‌మ‌న్వ‌య‌క‌ర్త క‌టారియా త‌దిత‌రులు అత్యుత్త‌మ స్టాళ్ల ల‌ఖ్‌ప‌తిదీదీల‌కు స‌ర్టిఫికెట్లు అంద‌జేసి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తొలిసారి ఢిల్లీని దాటి స‌ర‌స్ విజ‌య‌వాడ వ‌చ్చింద‌ని.. ఈ మేళా మహిళా శక్తి సామర్థ్యాన్ని, గ్రామీణ మహిళల పారిశ్రామిక ప్రతిభను చాటిచెబుతూ ఘన విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. ఈ జాతీయ స్థాయి మేళాలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించగా, సందర్శకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. 50 లైవ్ ఫుడ్ స్టాళ్ల‌తో పాటు మొత్తం 650 వ‌ర‌కు స్టాళ్లు ప్ర‌జ‌ల‌కు మ‌ధురానుభూతుల‌ను మిగిల్చాయన్నారు.
Scroll for the next article