News21st Oct 05:01 PMSunil Byrisetty1 min read
జాతీయ సరస్ మేళాలో రూ.7 కోట్ల వ్యాపారం
విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఈ నెల 13వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా–2026కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎన్టీఆర్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్
విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఈ నెల 13వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా–2026కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎన్టీఆర్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.ఎన్.వి. నాంచారరావు తెలిపారు. ఇప్పటివరకు మేళాలో సుమారు రూ.7 కోట్ల వ్యాపారం జరిగినట్లు వెల్లడించారు. సాధారణంగా ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో నిర్వహించే జాతీయ స్థాయి సరస్ మేళాను తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహించడం విశేషమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, చేతివృత్తుల కళాకారులు ఈ మేళాలో పాల్గొంటూ తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయిస్తున్నారని తెలిపారు. మేళా ప్రాంగణంలో మొత్తం 587 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నాంచారరావు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళల కోసం 210 స్టాళ్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. మహిళలు తయారు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాలు, టెక్స్‌టైల్స్, వివిధ రకాల ఆహార ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.