News23rd Oct 04:56 PMSunil Byrisetty1 min read
కోటి దాటిన కోకొల్లల రుచుల సంగమం..
విజయవాడ, పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు, వారి నైపుణ్యాలకు, ఆర్థిక స్వావలంబనకు చక్కని వేదికగా నిలుస్తోందని.. అదే విధంగా ప్రాంగణంల
విజయవాడ, పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు, వారి నైపుణ్యాలకు, ఆర్థిక స్వావలంబనకు చక్కని వేదికగా నిలుస్తోందని.. అదే విధంగా ప్రాంగణంలోని లైవ్ ఫుడ్ కోర్టులో అమ్మకాలు కోటి రూపాయలు దాటడం విశేషమని, ఇది ఆహార ప్రియుల నుంచి లభిస్తున్న ఆదరణకు, మహిళల కృషికి నిదర్శనమని అన్నారు. సరస్ మేళాలోని ఫుడ్ కోర్టులో అమ్మకాలు రూ. కోటి దాటిన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆహార ఉత్పత్పుల విజయాన్ని పురస్కరించుకొని వారిని అభినందించి ప్రోత్సహించారు. కేక్ కట్ చేసి విజయానందపు రుచిని పంచిపెట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలు, సంప్రదాయ ఆహార రుచులను ఒకే వేదికపై ఆస్వాదించే అవకాశం సరస్ మేళా ద్వారా కలుగుతోందన్నారు. 50 లైవ్ ఫుడ్ స్టాల్స్‌లో వివిధ ప్రాంతాల ప్రత్యేక వంటకాలను అక్కడికక్కడే తయారుచేసి అందించడం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు.