Education7th Sep 10:45 AMSunil Byrisetty1 min read

ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా

అతి త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. నవంబర్ లో నంది నాటకోత్సవాలను రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నామన్నారు.

ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
అతి త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. నవంబర్ లో నంది నాటకోత్సవాలను రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నామన్నారు. ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బ్రాంచ్ ను ఏపీకి ఇవ్వాలని కోరానన్నారు. ఇందుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అతి అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను తీసుకొచ్చి తీరుతామని ఘంటాపథంగా తెలిపారు. తద్వారా నాటక రంగంలోని ఔత్సాహిక కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఏపీకి సినిమా పరిశ్రమ తరలిరావాలన్నారు.
Andhra Pradesh
National School of Drama
NSD Branch
Nandi Awards
Nandi Natakotsavam
Rajamahendravaram
Chandrababu Naidu
Gajendra Singh Shekhawat
ఏపీలో త్వరలోనే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
Scroll for the next article