News30th Apr 05:32 PMSunil Byrisetty1 min read

కేంద్రం నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు

పహల్గాం ఉగ్ర దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డు దేశ భద్రతా వ్యవహారాలపై సలహాలు, స

కేంద్రం నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డు దేశ భద్రతా వ్యవహారాలపై సలహాలు, సిఫార్సులు అందించే ఉన్నత స్థాయి సంస్థగా పనిచేయనుంది. ఈ బోర్డుకు మాజీ రా (RAW) చీఫ్ అలోక్ జోషిని ఛైర్మన్‌గా నియమించారు. జాతీయ భద్రతా విషయాల్లో అనుభవం ఉన్న అలోక్ జోషి నాయకత్వంలో ఈ బోర్డు దేశ భద్రతా వ్యూహాలను మరింత బలోపేతం చేయనుంది. ఈ బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు, సైన్యం నుంచి రిటైరైన మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా ఈ బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు. వీరి అనుభవం, సైనిక వ్యూహాలు పాక్‌ను ఎదుర్కోవడంలో ఉపయోగపడనున్నాయి.
Chairman Of National Security Advisory Board
PM Modi
Pahalgam Attack
జాతీయ భద్రతా సలహా బోర్డు
బోర్డుకు మాజీ రా చీఫ్ అలోక్ జోషిని ఛైర్మన్‌
మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్
బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు
Scroll for the next article