Sports20th Aug 03:42 PMSunil Byrisetty1 min read

క్రీడారంగాన్ని అగ్రస్థానంలో నిలబెడతాం

క్రీడా రంగాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈనెల 29న విశాఖపట్టణం వేదికగా నేషనల్ స్పోర్ట

క్రీడారంగాన్ని అగ్రస్థానంలో నిలబెడతాం
క్రీడా రంగాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈనెల 29న విశాఖపట్టణం వేదికగా నేషనల్ స్పోర్ట్స్ డే ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని వివరించారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడా పోటీలను శాప్ ఛైర్మన్ రవినాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి 2వేల మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. తొలుత ఇండోర్ స్టేడియంలోని బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ కోర్టులను సందర్శించి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అంతర్జాతీయ హకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్‌ను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈనెల 29న నిర్వహించే స్పోర్ట్స్ డే వేడుకలో సీఎం చంద్రబాబు చేతులు మీదుగా నగదు ప్రోత్సాహకాలు, పతకాలు అందజేస్తామన్నారు.
Andhra Pradesh Sports
Chandrababu Naidu
Sports Development
National Sports Day
Visakhapatnam
Major Dhyan Chand
Zonal Sports Competitions
SHAP Chairman Ravinaidu
Scroll for the next article