News12th Jan 12:24 PMSunil Byrisetty1 min read
నేషనల్ యూత్ డే.. రక్తదానానికి పిలుపు
రక్తదానం చేసేందుకు యువత మరింత ముందుకు రావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు ఇచ్చారు. యువత ఔదార్యంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారి ప్రాణాలకు భరోసా ఏర్పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్
రక్తదానం చేసేందుకు యువత మరింత ముందుకు రావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు ఇచ్చారు. యువత ఔదార్యంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారి ప్రాణాలకు భరోసా ఏర్పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ యేడాదికేడాది రక్తందానంచేసే వారి సంఖ్య స్వల్పంగా పెరుగుతున్నా.. అవసరం అధికంగా ఉన్నందున యువత మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏటా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం (నేషనల్ యూత్ డే) సందర్భంగా రక్తదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార వైద్య కళాశాలలో సోమవారం ఉదయం జరిగే రక్తదానం కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. 'నేషనల్ యూత్ డే' సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి. రక్తదానం చేయడంవల్ల సామాజిక సేవలో పాల్గొన్నామన్న మానసిక సంతృప్తి కూడా కలుగుతుందని పేర్కొన్నారు. ఒక యూనిటు రక్తం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుందని తెలిపారు. నూటికి నూరు శాతం రక్తదానం వాలంటరీగా జరగాలని పేర్కొన్నారు.