News8th Oct 03:17 PMSunil Byrisetty1 min read
తిరుపతిలో ప్రారంభమైన జాతీయ స్థాయి సహకార వర్క్ షాప్
భారత ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకార శాఖతో కలిసి, “సహకార రంగం అభివృద్ధి – డిజిటలైజేషన్, గ్రైన్ స్టోరేజ్, M-PACS విస్తరణ మరియు కోఆపరేటి
భారత ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకార శాఖతో కలిసి, “సహకార రంగం అభివృద్ధి – డిజిటలైజేషన్, గ్రైన్ స్టోరేజ్, M-PACS విస్తరణ మరియు కోఆపరేటివ్ బ్యాంకింగ్ బలపరిచే దిశగా” అనే అంశంపై జాతీయ స్థాయి రెండు రోజుల వర్క్ షాప్ బుధవారం ఉదయం తిరుపతి తాజ్ హోటల్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రెండు రోజుల సదస్సును రాష్ట్ర సహకార కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్ ఎ. బాబు, భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వశాఖ కార్యదర్శి డా. అశీష్ కుమార్ భూటాని, అదనపు కార్యదర్శులు పంకజ్ కుమార్ బన్సాల్, రవీంద్ర కుమార్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శులు ఆనంద్ కుమార్ ఝా, రమణ్ కుమార్ లతో కలసి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం వారికి పుష్పగుచ్చాలను అందించి శ్రీవారి ప్రతిమలను కానుకగా సమర్పించారు. సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వారు పరిశీలించారు. డా. అశీష్ కుమార్ భూటాని మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహిస్తున్న శ్రేణిలో నేడు ఐదవ వర్క్‌షాప్ ను తిరుపతి పట్టణంలో నిర్వహిస్తున్నామని, ఇది మన అందరి విజయానికి నిదర్శనమన్నారు.