News30th Dec 05:52 PMSunil Byrisetty1 min read
గుంటూరులో జనవరి 6 నుండి 18 వరకు సారస్
సారస్ (SARAS- సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) మస్కట్ ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా విడుదల చేశారు. సారస్ ను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్
సారస్ (SARAS- సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) మస్కట్ ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా విడుదల చేశారు. సారస్ ను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. గుంటూరు మిరపకు ప్రసిద్ధి చెందడంతో "మిరప కాయ" నే మస్కట్ గా ఎంపిక చేసి రూపొందించారు. సారస్ ప్రదర్శన జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గుంటూరులో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా జాతీయ స్థాయి సారస్ కార్యక్రమం జరుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఆయా రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే చేనేతలు, హస్తకళలు, ఇతర సామగ్రిని ప్రదర్శించడం, విక్రయించడం జరుగుతుందని తెలిపారు. మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనంను తలపిస్తుందని చెప్పారు. 600 మందికి పైగా చేనేత, హస్త కళాకారులు, సాంస్కృతిక కళాకారులు వస్తున్నారని, 250కు పైగా ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.