News27th Jan 10:34 AMSunil Byrisetty1 min read
బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. మూడో రోజు నిలిచిపోనున్న సేవలు!
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు నేడు దేశవ్యాప్త బ్యాంకు సమ్మె కొనసాగుతోంది. ప్రధానంగా వారానికి ఐదు రోజుల పని దినాల డిమాండ్‌తో ఉద్యోగులు ఈ నిరసన చేపట్టారు. ఇప్పటిక
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు నేడు దేశవ్యాప్త బ్యాంకు సమ్మె కొనసాగుతోంది. ప్రధానంగా వారానికి ఐదు రోజుల పని దినాల డిమాండ్‌తో ఉద్యోగులు ఈ నిరసన చేపట్టారు. ఇప్పటికే జనవరి 25, గణతంత్ర దినోత్సవం 26 సెలవులు కావడంతో.. నేడు సమ్మె కారణంగా వరుసగా మూడవ రోజు కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రభుత్వ బ్యాంకులైన ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా మూసివేయబడతాయి. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు తెరిచి ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత కారణంగా సేవల్లో అంతరాయం కలగవచ్చు. శనివారాలను సెలవులుగా ప్రకటించి.. ఐదు రోజుల పని వారాన్ని అమలు చేయాలని బ్యాంకు యూనియన్లు కోరుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉద్యోగులకు ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.