News23rd Oct 03:51 PMSunil Byrisetty1 min read
గురుకులాల్లో ప్రకృతి సాగు.. పోషకాలతో ఆరోగ్యం బాగు
గురుకుల విద్యార్థుల కు పోషకాలతో కూడిన ఆహారం అందించడానికి, పంట ద్వారా ఆదాయం ఆర్జించడానికి కిచెన్ గార్డెన్, వెజిటబుల్ ఎటిఎం దోహదం చేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్
గురుకుల విద్యార్థుల కు పోషకాలతో కూడిన ఆహారం అందించడానికి, పంట ద్వారా ఆదాయం ఆర్జించడానికి కిచెన్ గార్డెన్, వెజిటబుల్ ఎటిఎం దోహదం చేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఏ. కొండూరు మండలం కృష్ణారావు పాలెంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం, రామన్నపాలెంలో ప్రకృతి వ్యవసాయ పొలాలు, ఏ.కొండూరులో రైస్ మిల్లు, ధాన్యం సేకరణ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలోని 12 గురుకులాలలో ఏడు గురుకులాలను ప్రకృతి సాగుకు అనుకూలమని గుర్తించామని, వీటిలో నాలుగు గురుకులాల్లో ప్రకృతి సాగు ప్రారంభించామని చెప్పారు. దుంప జాతులు, తీగ జాతులు, ఆకుకూరలు సహా 22 రకాల కూరగాయలను సహజ సిద్ధంగా పెంచుతున్నామన్నారు. మొదటి నెలలో పాలకూర, రెండవ నెలలో తోటకూర, మూడవ నెలలో మిరప వంగ, బెండ, నాలుగవ నెలలో క్యారెట్.. ఇలా ఒక్కో నెలలో ఒక్కో పంటతో ఆదాయం పొందే వెజిటబుల్ ఎటిఎం విధానం అమలు చేస్తున్నామన్నారు. అనంతరం ఏ. కొండూరులో వరి ధాన్య సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరణ షెడ్యూల్ ను వాట్సాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. 7337559375 నెంబర్ కు ఈ క్రాప్ లో నమోదైన రైతు ఆధార్ నెంబర్ పంపితే, శాంపిల్ టెస్టింగ్, సేకరణ తేదీ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేస్తామన్నారు.