Spiritual13th Jul 11:53 AMSunil Byrisetty1 min read
నవగ్రహలు పవర్ఫుల్.. విశిష్టత తెలుసా!
జాతకం ప్రకారం గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ఫలితం చేకూరుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా. ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధి
జాతకం ప్రకారం గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ఫలితం చేకూరుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా. ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. మూడోవాడైన రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. దోషాలను నివృత్తి చేస్తాడు. గురువును ఆరాధిస్తే.. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే.. ఇలా చేయొద్దు.. ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని మార్గాన్ని చూపెడతాడు.
ఇక బుధ గ్రహం బుద్ధిమంతుడు. మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగలే సమర్థుడు. మాట్లాడటంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. కేతువును పూజిస్తే.. తీర్థయాత్రలకు వెళ్తారు. లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని.. దేవతా పూజలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు. తర్వాతి గ్రహం శుక్రుడు. శుక్రాచార్యుడు. ఈయన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు. సంతానాన్ని ఇవ్వగలుగుతాడు. గ్రహాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి. ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తితే.. గ్రహదోషమని భావించాలి. ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందనే విషయాన్ని జ్యోతిష్యుల సూచనల మేరకు, శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అంటారు.