Education11th Aug 03:21 PMSunil Byrisetty1 min read
ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వినతి పత్రం అందించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా అన్ని జిల్లాల్లో జేఎన్వీలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2027–28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించేలా చూడాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతోందని వివరించారు. నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్రానికి ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదనలు పంపారని ఎంపీలు తెలిపారు. నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం ఉచితంగా భూమి, తాత్కాలిక భవనాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి వివరించారు.