News14th Jun 02:45 PMSunil Byrisetty1 min read
నవోదయంతో నాటుసారా రహిత జిల్లా లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లాను నాటుసారా రహితంగా తీర్చిదిద్దేందుకు సమష్టి భాగస్వామ్యంతో నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. తి
ఎన్టీఆర్ జిల్లాను నాటుసారా రహితంగా తీర్చిదిద్దేందుకు సమష్టి భాగస్వామ్యంతో నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. తిరువూరు మండలం వేమిరెడ్డిపల్లి తండాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నవోదయం 2.0 కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. జిల్లాలో మొదటి దశ నవోదయం సత్ఫలితాలు ఇచ్చిందని, ఇదే స్ఫూర్తితో పూర్తి నిర్మూలన లక్ష్యంగా నవోదయం 2.0ను ప్రారంభించినట్లు వివరించారు. గుర్తించిన ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాస్థాయి కమిటీ కూడా సేవలందిస్తుందన్నారు. కమిటీల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నాటుసారా వ్యాపారం చేసే వారిపై చట్టపర చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.