News14th Apr 06:33 PMSunil Byrisetty1 min read

అక్రమ మద్యంపై ఉక్కుపాదం.. నవోదయం 2.0

ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ మద్యం రవాణాను అణిచివేతకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహిస్తోంది. నవోదయం 2.0 కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని ఒడిశా,

అక్రమ మద్యంపై ఉక్కుపాదం.. నవోదయం 2.0
ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ మద్యం రవాణాను అణిచివేతకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహిస్తోంది. నవోదయం 2.0 కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దులలోని కీలక ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల ద్వారా అనేక మద్యం ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి, వందలాది లీటర్ల బెల్లం ఊట, నాటు సారా పట్టుబడింది. సాధారణ పరిపాలనా శాఖ (పొలిటికల్), ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా స్పష్టమైన ఆదేశాలతో ఈ దాడులు జరిగాయి. ఏపీ నుంచి 228 మంది, పొరుగు రాష్ట్రాల నుంచి 153 మంది, మొత్తం 381 మంది అధికారులు ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. మొత్తం 56,200 లీటర్ల బెల్లం ఊట, 2,070 లీటర్ల నాటు సారా, 25 కిలోల అమోనియా స్వాధీనం చేసుకున్నారు. 50 మద్యం ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసం చేసి, 28 కేసులు నమోదు చేశారు.
Andhra Pradesh
Navodhayam 2.o Story
ఏపీ సరిహద్దు
ఎక్సైజ్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహిస్తోంది
ముకేశ్ కుమార్ మీనా
Scroll for the next article