Politics15th Nov 04:31 PMSunil Byrisetty1 min read
పంచాయతీల్లోనూ కూటమిదే హవా!
రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ NDA కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించడం ఖాయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన మున్సిపల్, పరిషత్
రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ NDA కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించడం ఖాయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి సాధించిన అఖండ విజయాన్ని పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతం చేస్తామని స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా NDA కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, గ్రామస్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై చర్చించారు. గ్రామస్థాయిలో కూటమి నాయకులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని అందించారని, అదే ప్రజాభిమానంతో రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.