Politics8th Nov 04:07 PMSunil Byrisetty1 min read

అర్బన్ అయినా రూరల్ అయినా కూటమిదే!

ఏపీ స్థానిక ఎన్నికల్లో NDA కూటమి ఘన విజయం సాధించింది. మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి పరిషత్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించింది. పరిషత్ ఎన్నికల్లో కూటమికి 61 శాతం, వైసీపీకి 28

అర్బన్ అయినా రూరల్ అయినా కూటమిదే!
ఏపీ స్థానిక ఎన్నికల్లో NDA కూటమి ఘన విజయం సాధించింది. మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి పరిషత్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించింది. పరిషత్ ఎన్నికల్లో కూటమికి 61 శాతం, వైసీపీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఏపీలో ఎన్నికలు జరిగిన మొత్తం ZPTC స్థానాలు 582 కాగా.. టీడీపీకి 409, జనసేన 72, బీజేపీకి 20 స్థానాలు దక్కాయి. ZPTCల్లో కూటమికి దక్కిన మొత్తం స్థానాలు 501గా ఉన్నాయి. ZPTC: వైసీపీకి 76, స్వతంత్రులకు 5 స్థానాలు లభించాయి. మొత్తం ఎన్నికలు జరిగిన MPTCలు 7,769 అయితే MPTC: టీడీపీకి 4,821, జనసేన 940, బీజేపీకి 115 స్థానాలు, వైసీపీకి 1,702, స్వతంత్రులకు 189 స్థానాలు దక్కాయి.
Scroll for the next article