Politics3rd Nov 05:19 PMSunil Byrisetty1 min read

కొండపల్లిలో కూటమి విజయభేరి!

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి, సమన్వయంతో ఎన్నికల్లో మెజారిటీ వార్డుల్లో వ

కొండపల్లిలో కూటమి విజయభేరి!
కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి, సమన్వయంతో ఎన్నికల్లో మెజారిటీ వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్డీఏ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఇబ్రహీంపట్నంలోని శ్రీ రామాలయం కళ్యాణ మండపంలో ఉండి కౌంటింగ్ ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాల వివరాలను తెలుసుకుంటూ, కూటమి అభ్యర్థుల విజయాలను పరిశీలించారు. చైర్మన్ అభ్యర్థి ఎంపిక నుంచి వార్డు అభ్యర్థుల ఖరారు వరకు, ఎన్నికల ప్రచారం నుంచి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం వరకు ప్రతి అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కూటమి భాగస్వామ్య పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ విజయానికి అవసరమైన వ్యూహాలను అమలు చేశారు. ఎమ్మెల్యే వసంత రూపొందించిన ఎన్నికల వ్యూహం, కూటమి నాయకుల సమష్టి కృషి, కార్యకర్తల నిరంతర శ్రమకు ప్రజల మద్దతు తోడవడంతో ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాల్లో విజయాన్ని నమోదు చేసింది.
Scroll for the next article