Politics14th Nov 11:36 AMSunil Byrisetty1 min read
బిహార్లో మ్యాజిక్.. ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యత
ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే బిహార్లో ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యత దిశగా సాగుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా కనిపిస్తోంది. ప్రస్తుతం 159 స్థానాల్లో ఎన్డీయ
ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే బిహార్లో ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యత దిశగా సాగుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా కనిపిస్తోంది. ప్రస్తుతం 159 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహా ఘట్ బంధన్ కూటమి అభ్యర్థులు 71 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మరో 4 చోట్ల ఇతరులకు ఆధిక్యంలో ఉన్నారు. బిహార్ మొత్తం 243 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్లు కావాలి. ఇప్పటికే ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ని దాటేసింది. దాదాపు 175 సీట్లలో ఎన్డీయే ముందంజలో ఉంది.