News28th Jul 04:57 PMSunil Byrisetty1 min read

ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం దృష్టి

ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్ఓసీ

ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం దృష్టి
ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్ఓసీని(లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని కూటమి నేతలతో కలిసి అందజేశారు. 43 వ డివిజన్ ఊర్మిళ నగర్ కు చెందిన పంగా వీరాంజనేయులు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా బాధితుని భార్య వరమ్మ కు రూ 5 లక్షల 21 వేల ఎల్ఓసీ అందజేశారు. శ్రీరామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్యం కోసం త్వరలోనే సంచార వైద్యశాలలను ప్రారంభించడానికి సిద్ధమయ్యారని అన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు నున్న కృష్ణ, లవిన్ బాబు, ఏలూరి సాయి శరత్, వల్లూరు మధుసూదన రావు, రేగళ్ల లక్ష్మణరావు పాల్గొన్నారు.
Andhra Pradesh News
NDA Government
Public Health
BJP NTR District
Aduri Sriram
Sujana Chowdary
LOC Sanction
Urmila Nagar
Medical Assistance
Mobile Clinics
ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం దృష్టి
Scroll for the next article