Politics7th Mar 06:47 PMSunil Byrisetty1 min read

భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోం

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోదని మరో స

భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోం
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోదని మరో సారి సభా ముఖంగా స్పష్టం చేశారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు విద్యుత్ చార్జీలను వైసీపీ నాయకులే పెంచి, వాటిపై వాళ్లే ధర్నాలు చేసి, సభలో ఏమీ తెలియనట్టు ప్రశ్నలు అడుగుతున్నారని మండిపడ్డారు. 2022-23, 2023-24 ఏడాదికి గాను వైసీపీ ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం మోపిందని తెలిపారు. గతంలో 2014-19 వరకు మా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేనాటికి మిగులు విద్యుత్ తో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వానికి అప్పగించామని చెప్పిన మంత్రి... గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని స్పష్టం చేశారు. జగన్ అనాలోచిత చర్యలతో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని వైసీపీ నాయకులపై మండిపడ్డారు.
Minister Narayana Gottipati Ravi Kumar
Current bills
YSRCP
Andhra Pradesh
మంత్రి నారాయణ గొట్టిపాటి రవి కుమార్
కరెంట్ బిల్లులు
ఆంధ్ర ప్రదేశ్
Scroll for the next article