Politics9th Nov 04:02 PMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో ఎన్డీఏ బలం పెరిగింది!

ఎన్నికల ఫలితాల వివరాలపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీఏ బలం పుంజుకుందన్నారు. స్థానిక సంస్థల్లో పట్టణా

రాష్ట్రంలో ఎన్డీఏ బలం పెరిగింది!
ఎన్నికల ఫలితాల వివరాలపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీఏ బలం పుంజుకుందన్నారు. స్థానిక సంస్థల్లో పట్టణాలు, పరిషత్ ఎన్నికల్లో కూటమి మొత్తంగా 58.9 ఓట్ల శాతాన్ని సాధించిందని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో ఇది 55.3 శాతం-2024తో పోలిస్తే స్థానిక ఎన్నికల నాటికి ఎన్డీఏకు 3.6% ఓట్లు పెరిగాయని విశ్లేషించారు. స్థానిక ఎన్నికల్లో మొత్తంగా 33.56 శాతం వైసీపీకి పడ్డాయని, అదే 2024 ఎన్నికలలో 39.81 శాతం వచ్చాయని వివరించారు. 2024తో పోలిస్తే వైఎస్సార్సీపీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయని తెలిపారు.
Scroll for the next article