Politics1st Sep 03:55 PMSunil Byrisetty1 min read
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్డీయేకు తిరుగులేని విజయం
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్డీయేకు తిరుగులేని విజయం వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇది చూసి ‘గొడ్డలి పార్టీ’కి వణుకు పుట్టిందని, స్థానిక సంస్థల ఎన్నికల
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్డీయేకు తిరుగులేని విజయం వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇది చూసి ‘గొడ్డలి పార్టీ’కి వణుకు పుట్టిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవమైతే ఊరుకోబోమని చెబుతోందన్నారు. ప్రజలు ఏకగ్రీవం చేసుకుంటే వైసీపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వాలే ఏకగ్రీవాలను ప్రోత్సహించాయని, గ్రామాల్లో గొడవలు కాకుండా ఐకమత్యంతో ఉండాలని సింబల్ లేకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నామని వివరించారు. మంచి నాయకులను ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. మున్సిపాలిటీల్లో ఆయారాం, గయారాంలను పెట్టుకుని ఆరు నెలలకోసారి మార్చేయడం కాకుండా ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు పెట్టామని వివరించారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టి నచ్చిన అభ్యర్థిని ఎంచుకునే అవకాశాన్ని కల్పించామని, నర్సాపురంలో అలా ఎన్నుకోవచ్చని సీఎం పేర్కొన్నారు. ఐదేళ్లు పదవి గ్యారంటీ అని, తప్పు చేస్తే, అవినీతి చేస్తే ప్రభుత్వ అధికారాలతో తొలగించవచ్చని చెప్పారు.