News10th Oct 03:16 PMSunil Byrisetty1 min read
బీసీ రిజర్వేషన్లపై ఎన్డీయేది ఒకటే మాట, ఒకటే బాట!
బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని ప్రయత్నాలు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఏక సభ్య కమిషన్ రిపోర్టు ప్రకారం కొన్ని చోట్ల బీసీలకు రిజర్వేషన్లు పెరిగాయని, ఎక
బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని ప్రయత్నాలు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఏక సభ్య కమిషన్ రిపోర్టు ప్రకారం కొన్ని చోట్ల బీసీలకు రిజర్వేషన్లు పెరిగాయని, ఎక్కడో ఒక చోట మాత్రమే తగ్గాయని చెప్పారు. ఒకవేళ 34 శాతం కన్నా తగ్గితే, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే పార్టీలు 34 శాతం కన్నా పెంచి అమలు చేస్తాయని వివరించారు. ఈ విషయంలో వెనకడుగు వేయబోమన్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక ప్రకారం పంచాయతీల్లో వార్డులకు 26.73 శాతం రిజర్వేషన్లు వస్తున్నాయన్నారు. జగన్ కేవలం 24 శాతం మాత్రమే ఇచ్చారని, చట్టప్రకారం 26.73 శాతం ఇస్తే, మిగతావి ఎన్డీయే పక్షాల్లో చర్చించి ఇస్తామన్నారు. సర్పంచులకు 27.95 శాతం, ఎంపీటీసీలు 25.55 శాతం, ఎంపీపీ, జడ్పీటీసీ: 24.60%, జడ్పీ చైర్మన్లు 23.08%, అలాగే అర్బన్ వార్డు మెంబర్స్ 32.78%, మున్సిపల్ చైర్ పర్సన్లు 33.02%, మేయర్లు 35.29% వస్తారని వివరించారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిన చోట్ల పార్టీపరంగా 34% పైగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, వీటిపై త్వరలో జాబితా ఇస్తామని, వాటికి గొడ్డలి పార్టీ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. 2022లో బీసీలకు వైసీపీ ఎన్ని పదవులు ఇచ్చిందో లెక్క ఉందన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదన్నారు. బీసీలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ న్యాయమే చేస్తుందన్నారు. చట్టప్రకారమే ఇప్పుడు చెప్పిన రిజర్వేషన్లు వస్తున్నాయని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు.