Politics25th Oct 02:14 PMSunil Byrisetty1 min read

బిహార్లో గెలిచేది ఎన్డీయేనే

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తంచేశారు. బిహార్ సీఎం నీతీశ్‌ కుమార్, అధికార కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని వెల్లడించారు

బిహార్లో గెలిచేది ఎన్డీయేనే
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తంచేశారు. బిహార్ సీఎం నీతీశ్‌ కుమార్, అధికార కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని వెల్లడించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుల సాధికారతే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నికల హామీ ‘సూపర్ సిక్స్‌’ను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. ప్రధాని మోదీ 2000 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఎన్నికల్లో విజయం సాధిస్తూనే ఉంటారు. గతంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. మరో నాలుగు సంవత్సరాలు ఆయనే ఉంటారు. ఈ దశాబ్దం మోదీదే. అంటే ఆటోమెటిగ్గా భారతీయులదే’’ అని చంద్రబాబు వెల్లడించారు.
Bihar Elections
NDA Victory
Chandrababu Naidu
Nitish Kumar
Telugu Desam Party
NDA Government
Indian Politics
Modi
Double Engine Government
ఎన్డీయే ప్రభుత్వం
భారతీయ రాజకీయాలు
మోడీ
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం
ఎన్నికల ఊహాగానం
Scroll for the next article