Education27th Jul 04:03 PMSunil Byrisetty1 min read

మూతబడుతున్న ప్రభుత్వ బడులు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ప్రతియేటా తగ్గుతున్నాయి. విలీనం, రేషనలైజేషన్‌ ‌పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా వందల సంఖ్యలో మూసివేస్తోంది. గత వైసిపి ప్రభుత్వంలోని పాఠశాలలు మూసివేత ప్రస

మూతబడుతున్న ప్రభుత్వ బడులు
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ప్రతియేటా తగ్గుతున్నాయి. విలీనం, రేషనలైజేషన్‌ ‌పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా వందల సంఖ్యలో మూసివేస్తోంది. గత వైసిపి ప్రభుత్వంలోని పాఠశాలలు మూసివేత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతోంది. పేదలు చదువుకునే 972 పాఠశాలలు గత మూడేళ్లలో మూతబడ్డాయి. వీటిల్లో ప్రభుత్వ బడులు 778 ఉండగా, ఎయిడెడ్‌ ‌బడులు 194 ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024-25 విద్యా సంవత్సరం నుంచి 2025-26 విద్యాసంవత్సరం మధ్య 664 పాఠశాలలు మూతపడ్డాయి. మరోపక్క గడిచిన మూడేళ్లల్లోనే సర్కారు ‌బడికి 5,86,666 మంది విద్యార్థులు దూరమయ్యారు. కేంద్ర విద్యాశాఖ వెల్లడించిన ‌యుడైస్‌ ‌ప్లస్‌ లెక్కల ప్రకారం బడులు మూతబడినట్లు తెలుస్తోంది.
Andhra Pradesh
Government Schools
School Closures
UDISE Plus
Education
School Education
Student Enrolment
ప్రభుత్వ విద్య
ఎయిడెడ్ పాఠశాలలు
విద్యా విధానం
ప్రభుత్వ బడుల సంక్షోభం
Scroll for the next article