Health15th Nov 03:54 PMSunil Byrisetty1 min read

60 లక్షల మందికి హై బీపీ.. టెన్షన్!

రాష్ట్రంలో NCD 4.0 (Non-Communicable Diseases) ద్వారా కొత్తగా 12,23,185 మందికి అధిక రక్తపోటు, 11,58,632 మందికి మధుమేహం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. రాష్ట్ర జనాభాలో 18 ఏళ

60 లక్షల మందికి హై బీపీ.. టెన్షన్!
రాష్ట్రంలో NCD 4.0 (Non-Communicable Diseases) ద్వారా కొత్తగా 12,23,185 మందికి అధిక రక్తపోటు, 11,58,632 మందికి మధుమేహం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. రాష్ట్ర జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 2.85 కోట్ల మందికి బీపీ, మధుమేహం, నోటి క్యాన్సర్ పరీక్షలు, 1.46 కోట్ల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార పరీక్షలు నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం బీపీతో ఉన్నవారు 59.63 లక్షలు, మధుమేహంతో ఉన్నవారు 48.95 లక్షల మంది ఉన్నారు. అన్ని కేసులు కలిపితే బీపీ+షుగర్ కలిగి ఉన్న వారు రాష్ట్రoలో 34 లక్షల మంది ఉన్నారు. ఈ సర్వేను గత ఏడాది సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ప్రారంభించారు. నవంబర్ 10న సర్వే ముగిసింది. గ్రామ, వార్డు స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మధుమేహ పరీక్షలు నిర్వహించారు. ఎన్‌సీడీ పరీక్షల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ వేదికల ద్వారా అమలు చేస్తున్నారు. ఆరోగ్య వివరాల నమోదు, కార్యక్రమ పర్యవేక్షణకు వీటిని వినియోగిస్తున్నారు.
Scroll for the next article