News12th Dec 04:24 PMSunil Byrisetty1 min read

ఐదేళ్లలో ఇండియాకు 9 లక్షల మంది బైబై

గత ఐదేళ్ల కాలంలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. ఈ డేటాను విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ

ఐదేళ్లలో ఇండియాకు 9 లక్షల మంది బైబై
గత ఐదేళ్ల కాలంలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. ఈ డేటాను విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చారు. భారత పౌరసత్వం విషయంలో పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానంలో ఈ డేటాను వెల్లడించారు. భారత పౌరసత్వాన్ని వదులుకునే వ్యక్తుల వార్షిక రికార్డులను ప్రభుత్వం భద్రపరుస్తోందని ఆయన అన్నారు. ఆ రికార్డుల ప్రకారం 2011-19 మధ్య 11,89,194 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత 14 సంవత్సరాలలో 20 లక్షలకు పైగా ప్రజలు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకునే భారతీయుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Indian Citizenship
Renunciation
MEA Report
Kirti Vardhan Singh
Rajya Sabha
Foreign Citizenship
Migration Trends
ప్రభుత్వ గణాంకాలు
భారతీయుల వలస
పౌరసత్వ డేటా
ఎన్‌ఆర్‌ఐ
ఓవర్సీస్ ఇండియన్స్
Scroll for the next article