Education3rd May 02:58 PMSunil Byrisetty1 min read
నీట్-2025 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 4వ తేదీ ఆదివారం నీట్-2025 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని.. అధికారులు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స
ఈ నెల 4వ తేదీ ఆదివారం నీట్-2025 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని.. అధికారులు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-2025పై విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో సెంటర్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ లక్ష్మీశ సూచనలు చేశారు.
జిల్లాలో 13,625 మంది అభ్యర్థులకు 28 కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరీక్ష జరుగుతుందన్నారు.
అర్హత కలిగిన పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సాయంత్రం ఆరు గంటల వరకు అవకాశముంటుందన్నారు.
విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఏర్పాట్లు, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియ, బయోమెట్రిక్ హాజరు, కంట్రోల్ రూమ్ విధులు, సీటింగ్ అరేంజ్‌మెంట్, వీడియోగ్రఫీ, సీల్డ్ కవర్స్, నివేదికలు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ నిర్వహణ తదితరాలపై శిక్షణ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.