Education25th Apr 12:38 PMSunil Byrisetty1 min read
నీట్ పరీక్ష.. ముందస్తుగా పరీక్షా కేంద్రం సమాచారం
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (నీట్ -2025)కు సంబంధించి కీలక అప్డేట్ అందింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి మే 4వ తేదీన జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ -2025కు దరఖాస
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (నీట్ -2025)కు సంబంధించి కీలక అప్డేట్ అందింది.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి మే 4వ తేదీన జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ -2025కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక సమాచారం అందించింది.
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏ నగరం, పట్టణంలో పరీక్ష కేంద్రం కేటాయించిన విషయాన్ని వెబ్ సైట్లో పెట్టినట్టు తెలిపింది.
విద్యార్థి పరీక్షకు హాజరయ్యే నగరం, పట్టణం పేరును ప్రకటించిన ఎన్టీఏ ఈ నెల 30వ తేదీ తర్వాత విద్యార్థికి కేటాయించిన పరీక్షా కేంద్రం వివరాలతో కూడిన అడ్మిట్ కార్డును ఎన్టీఏ వెబ్సైట్లో పెడతామని పేర్కొంది.