Education14th Jul 04:22 PMSunil Byrisetty1 min read

మంత్రి లోకేష్‌ను కలిసి నీట్ యూజీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కార్తీక్

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంక్, ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాజమహేంద్రవరానికి చెందిన

మంత్రి లోకేష్‌ను కలిసి నీట్ యూజీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కార్తీక్
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంక్, ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాజమహేంద్రవరానికి చెందిన డి.కార్తీక్ రామ్ కిరీటి ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. కార్తీక్ రామ్‌తో పాటు జేఈఈ అడ్వాన్స్ డ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 113వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 8వ ర్యాంక్ సాధించిన పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 311వ ర్యాంక్, ఆల్ ఇండియా ఎస్సీ కేటగిరీలో 2వ ర్యాంక్ సాధించిన రాజమహేంద్రవరానికి చెందిన కంచుమర్తి ప్రణీత్ మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి ఆయా విద్యార్థులు మంత్రిని కలిశారు. తమ ప్రతిభతో జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఆయా విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. మంగళగిరి శాలువాతో వారిని ఘనంగా సత్కరించారు.
Andhra Pradesh
Undavalli
NEET UG State First Ranker
Minister Nara Lokesh
D. Karthik Ram
JEE Advanced examinations
19th rank
మంత్రి లోకేష్‌ను కలిసి నీట్ యూజీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కార్తీక్
Scroll for the next article