News10th Jan 03:25 PMSunil Byrisetty1 min read

12 మంది మంత్రులపై వ్యతిరేక నివేదికలు

ఏపీ కేబినెట్‌లో 10 నుంచి 12 మంది మంత్రుల పనితీరుపై చంద్రబాబుకు ప్రతికూల నివేదికలు అందినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని, మరికొ

12 మంది మంత్రులపై వ్యతిరేక నివేదికలు
ఏపీ కేబినెట్‌లో 10 నుంచి 12 మంది మంత్రుల పనితీరుపై చంద్రబాబుకు ప్రతికూల నివేదికలు అందినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని, మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. గత ఆరు నెలల పనితీరును విశ్లేషించిన సర్వేలు ,ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా మంత్రులు దారికి రావడం లేదనే మార్పునకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. పనితీరు మార్చుకోని మంత్రులకు భవిష్యత్తులో కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరికలు పంపుతున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని, ప్రజల నుంచి వచ్చే స్పందనే ప్రామాణికంగా తీసుకుంటానని స్పష్టం చేశారు. మంత్రులు కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా, జిల్లాల్లో పర్యటించి ప్రజల నాడిని తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు.
Andhra Pradesh
AP Cabinet
Chandrababu Naidu
TDP
Ministers’ Performance
Intelligence Reports
ఇంటెలిజెన్స్ నివేదికలు
రాజకీయ సమీక్ష
ప్రభుత్వ పనితీరు
Scroll for the next article