Politics27th Nov 04:25 PMSunil Byrisetty1 min read

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆర్ అండ్ బీపై రూ.20 వేల కోట్ల భారం

2014-19 మధ్య కాలంలో శరవేగంగా రహదారులు నిర్మించి ఆర్ అండ్ బీ శాఖను అగ్ర భాగాన నిలబెడితే.. జగన్ ప్రభుత్వంలో రహదారులను నిర్లక్ష్యం చేసి రూ.20 వేల కోట్ల భారం పెట్టి వెళ్లాడని ఆర్ అండ్

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆర్ అండ్ బీపై రూ.20 వేల కోట్ల భారం
2014-19 మధ్య కాలంలో శరవేగంగా రహదారులు నిర్మించి ఆర్ అండ్ బీ శాఖను అగ్ర భాగాన నిలబెడితే.. జగన్ ప్రభుత్వంలో రహదారులను నిర్లక్ష్యం చేసి రూ.20 వేల కోట్ల భారం పెట్టి వెళ్లాడని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ అండ్ బీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు సూచనలతో పారదర్శకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రహదారులు గుంతలమయం అయ్యాయి. రిపేర్లు కూడా చేయకుండా వదిలేశారు. గత పాలకుల పాపాల కారణంగా రూ.20 వేల కోట్లు భారం ఆర్ అండ్ బీ శాఖపై పడింది. రహదారి వేసిన తర్వాత 5 ఏళ్లకి ఒకసారి మరమ్మతులు చేయాలి. గుంతలు పూడ్చడం చేయాలి. కానీ జగన్ హయాంలో అలాంటివి ఏమీ చేయలేదు. రహదారుల మరమ్మతులపై కనీసం రివ్యూలు కూడా చేయలేదు. 15 వేల కిమీ. రహదారులు ఎందుకు పనికిరాకుండా పోయాయి. 2014 - 19 నవ్యాంధ్రలో 26 వేల కి.మీ. సీసీ రహదారులు నిర్మించి... 22 వేల కి.మీ. బీటీ రహదారులు పూర్తి చేశాం. 7 వేల కి.మీ. జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణాలు పూర్తి చేశామ’ని వివరించారు.
Andhra Pradesh News
R&B Department
BC Janardhan Reddy
Road Development
Government Negligence
Chandrababu Naidu
ప్రభుత్వం
టీడీపీ
చంద్రబాబు
మౌలిక వసతులు
రహదారి గుంతలు
రోడ్డు నిర్వహణ
Scroll for the next article