News11th Sep 04:36 PMSunil Byrisetty1 min read
ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో ప్రథమ స్థానంలో నెల్లూరు కలెక్టర్
ప్రభుత్వ పరిపాలనలో వేగం, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యతనిస్తూ ఈ-ఫైళ్లను సత్వరమే పరిష్కరించడంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అమరావతిలో ముఖ్యమంత్రి
ప్రభుత్వ పరిపాలనలో వేగం, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యతనిస్తూ ఈ-ఫైళ్లను సత్వరమే పరిష్కరించడంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో మూడు నెలల ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌పై సమీక్షించగా, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రథమ స్థానంలో నిలినట్లు సీఎం ప్రకటించారు. 2026 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ మొత్తం 1,492 ఫైళ్లను పరిష్కరించి 100 శాతం డిస్పోజల్ రేటును సాధించారు. ఒక్క ఫైలు కూడా పెండింగ్‌లో లేకపోవడం విశేషం. అంతేకాకుండా, ప్రతి ఫైల్‌ను పరిష్కరించేందుకు పట్టిన సగటు సమయం కేవలం 5 గంటల 29 నిమిషాలు, 22 సెకన్లు మాత్రమే. ఈ సందర్భంగా హిమాన్షు శుక్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ హిమాన్షు వినూత్నంగా చేపట్టిన ‘పల్లె వీక్షణ’ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి అభినందించారు.