News4th Jul 12:15 PMSunil Byrisetty1 min read
కూటమి ప్రభుత్వంతో ప్రతి ఇంట్లో సంతోషం
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంట్లో సంతోషం నింపుతోందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డ
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంట్లో సంతోషం నింపుతోందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు పెడితే.. వాటన్నింటినీ సరిచేస్తూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించారని పేర్కొన్నారు.