News23rd Mar 02:37 PMSunil Byrisetty1 min read
నెల్లూరులో స్కూటర్ పై ఎమ్మెల్యే!
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్కూటర్ పై ప్రత్యక్షమయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులను పరిశీలించారు. 21వ డివిజన్ లో అభివృద్ధి ప
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్కూటర్ పై ప్రత్యక్షమయ్యారు.
నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులను పరిశీలించారు.
21వ డివిజన్ లో అభివృద్ధి పనుల స్థితిగతులను నేరుగా ప్రజల ఇంటి వద్దనే అడిగి తెలుసుకున్నారు.
ఇంకేమైనా సమస్యలు ఉన్నా వెంటనే నా దృష్టికి తీసుకుకొని రావాలని కోరారు.
పనులు జరుగుతున్న సమయంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే నేరుగా నాకే ఫోన్ చేయండని ప్రజలకు సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లో మే 20వ తేదికి పనులు పూర్తికావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే పర్యటిస్తున్న విషయం తెలిసి వచ్చిన స్థానిక డివిజన్ నాయకులను సున్నితంగా వారించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
రాబోవు రోజులలో కూడా ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండానే జరుగుతున్న అభివృద్ధి పనుల పై ఆకస్మిక పర్యటనలు కొనసాగుతాయని చెప్పారు.
హెల్మెట్ ధరించి స్కూటర్ పై ఎమ్మెల్యే పర్యటించడంపై నెల్లూరులో ప్రశంసలు వచ్చాయి.