International2nd Sep 04:12 PMSunil Byrisetty1 min read
కనీవినీ ఎరుగని విషాదం.. కన్నీట నేపాల్!
నేపాల్ కన్నీరు మున్నీరవుతోంది. ఆకస్మిక వరదలు అతలాకుతలం చేయడంతో వందలాది ప్రాణాలు నీటగలిశాయి. హిమానీ నదం విరిగిపడి విలయతాండవం సృష్టించిన ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ
నేపాల్ కన్నీరు మున్నీరవుతోంది. ఆకస్మిక వరదలు అతలాకుతలం చేయడంతో వందలాది ప్రాణాలు నీటగలిశాయి. హిమానీ నదం విరిగిపడి విలయతాండవం సృష్టించిన ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం నాటికి ఏకంగా 1,127 కు చేరినట్లు నేపాల్ పోలీస్ విభాగం అధికారికంగా ప్రకటించింది. భారీ వరద సంబంధించి వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా వేలాది మంది ఆచూకీ కానరావడం లేదు. దీంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ జలవిలయంలో మరణించిన వారి మృతదేహాలకు తాత్కాలిక ఖననం చేస్తున్నారు. గుర్తు తెలియని పదుల సంఖ్యలో ఒకేచోట మృతదేహాలను పాతిపెడుతున్నారు.