News3rd Aug 04:27 PMSunil Byrisetty1 min read

7 నుంచి ‘నేతన్న సేవలో..’

అర్హులైన వారందరికీ నేతన్న సేవలో పథకం వర్తింపజేస్తామని, చేనేతలకు ఆర్థిక భరోసాతో కూడిన గౌరవప్రదమైన జీవనం అందించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి ఎస్.సవిత తెలిపారు. నేతన్నలకు ఏటా రూ

7 నుంచి ‘నేతన్న సేవలో..’
అర్హులైన వారందరికీ నేతన్న సేవలో పథకం వర్తింపజేస్తామని, చేనేతలకు ఆర్థిక భరోసాతో కూడిన గౌరవప్రదమైన జీవనం అందించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి ఎస్.సవిత తెలిపారు. నేతన్నలకు ఏటా రూ.25 వేలను ఆర్థిక సాయం అందజేసేలా నేతన్న సేవలో పథకాన్ని రూపొందించారన్నారు. ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని శ్రీకారం చుడుతున్నామని, అయిదో తేదీలోగా అర్హులైన చేనేతలు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సవిత కోరారు. సచివాలయంలో అన్ని జిల్లాలకు చెందిన చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. చేనేతలకు గౌరవ ప్రదమైన జీవనం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. 50 ఏళ్లు నిండిన నేతలన్నకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి లబ్ధి కలిగేలా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మగ్గం మీద నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్ల వరకూ విద్యుత్ ను ఉచితంగా అందజేస్తున్నామన్నారు.
Andhra Pradesh
Netanna Sevalo
Handloom Weavers
S Savitha
Chandrababu Naidu
Weaver Welfare
జాతీయ చేనేత దినోత్సవం
ఆర్థిక సాయం
జౌళి శాఖ
ఎన్టీఆర్ భరోసా
ఉచిత విద్యుత్
చేనేత పథకం
Scroll for the next article