News4th Aug 12:07 PMSunil Byrisetty1 min read

7న ‘నేతన్నల సేవలో’

చీరాలలో ఆగస్టు 7న ‘నేతన్నల సేవలో’ పథకం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పథకం ప్రారంభం చేయనున్నారు. ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న అర్హులైన చేనేత కార్మికులకు ఏటా రూ.25 వేల

7న ‘నేతన్నల సేవలో’
చీరాలలో ఆగస్టు 7న ‘నేతన్నల సేవలో’ పథకం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పథకం ప్రారంభం చేయనున్నారు. ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న అర్హులైన చేనేత కార్మికులకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందనుంది. ‘నేతన్నల సేవలో’ పథకానికి ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చేస్తోంది. ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు విధించింది. అర్హులైన చేనేత కార్మికులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారుల సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని పథకాలు ప్రారంభించగా, రెండేళ్ల తర్వాత నేతన్నల సేవలో ప్రారంభమవుతోంది.
Andhra Pradesh
Netannala Sevalo
Chandrababu Naidu
Handloom Weavers
Chirala
Weaver Welfare
చేనేత సంక్షేమం
ఆర్థిక సాయం
జౌళి శాఖ
ఏపీ ప్రభుత్వం
సంక్షేమ పథకం
Scroll for the next article