Entertainment6th Dec 09:02 AMSunil Byrisetty1 min read

వినోద రంగంలో అతిపెద్ద డీల్!

వినోద రంగంలో అతిపెద్ద డీల్ జరిగింది. ప్రపంచంలోనే స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌, ప్రసిద్ధ వార్నర్ బ్రదర్స్ కంపెనీని సొంతం చేసుకునే ఒప్పందాన్ని పూర్తి చేసింది. 83 బిలియన్ డాలర్ల

వినోద రంగంలో అతిపెద్ద డీల్!
వినోద రంగంలో అతిపెద్ద డీల్ జరిగింది. ప్రపంచంలోనే స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌, ప్రసిద్ధ వార్నర్ బ్రదర్స్ కంపెనీని సొంతం చేసుకునే ఒప్పందాన్ని పూర్తి చేసింది. 83 బిలియన్ డాలర్లకు ఫిల్మ్ & టెలివిజన్ స్టూడియో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసింది. ఇది దశాబ్దంలోనే ఎంటర్టైన్మెంట్ రంగంలో జరిగిన అతిపెద్ద డీల్. నెట్‌ఫ్లిక్స్‌ వార్నర్ బ్రదర్స్‌, ఫిల్మ్ స్టూడియోలు, టెలివిజన్ స్టూడియోలు, HBO Max , HBOతో కలిపి పూర్తిగా కొనుగోలు చేసినట్లు సంయక్త ప్రకటన విడుదల చేశారు. ఈ డీల్‌ ద్వారా ఇప్పటి వరకు OTT లో ఆధిపత్యం చలాయించిన నెట్‌ఫ్లిక్స్‌, ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ బ్యానర్‌తో థియేట్రికల్ ఫిల్మ్ ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ 1997లో మామూలు DVD రెంటల్‌ సర్వీస్‌గా ప్రారంభమైంది. DVDల నుంచి ఆన్లైన్ స్ట్రీమింగ్‌ వైపు అడుగుపెట్టి, కంటెంట్ చూసే విధానాన్ని పూర్తిగా మార్చింది. తరువాత ఒరిజినల్ కంటెంట్‌ నిర్మాణం ప్రారంభించి హిట్‌ సిరీస్‌లతో అలరించింది. ఇప్పుడు జరిగిన డీల్ వరల్డ్ థియేటర్ సినిమాలో సంచలన మార్పులు తేనుంది.
Global Cinema
Netflix
Warner Bros
Entertainment News
Biggest Deal
Streaming Industry
Hollywood
Business News
Media Merger
OTT Update
Scroll for the next article