News26th Aug 03:21 PMSunil Byrisetty1 min read

ప్రతి నేతన్నకూ ‘నేతన్నల సేవలో’

మగ్గం నేసే ప్రతి నేతన్నకూ నేతన్నల సేవలో పథకం అందజేస్తామని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఈ నెలాఖరు వరకూ రెండో విడత లబ్ధిదారుల గుర్తింపు కా

ప్రతి నేతన్నకూ ‘నేతన్నల సేవలో’
మగ్గం నేసే ప్రతి నేతన్నకూ నేతన్నల సేవలో పథకం అందజేస్తామని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఈ నెలాఖరు వరకూ రెండో విడత లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం జరుగుతోందని, ఆ వెంటనే అర్హుల బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. వ్యవసాయం తరవాత అత్యధికంగా చేనేత వృత్తిపై అత్యధిక ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. నేతన్నలకు గౌరవప్రదమైన జీవనంతో కూడిన ఉపాధిని 365 రోజుల పాటు కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. 2014-19 పాలనా కాలంలో మొట్టమొదటిసారిగా 50 ఏళ్లు నిండిన చేనేతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, నేతన్నలకు ఇచ్చే రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 86 వేల మంది నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేశామన్నారు. మగ్గం నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేసే నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 51,952 మంది నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అందిస్తున్నామని తెలిపారు.
Andhra Pradesh
Nethannala Sevalo
Handloom Weavers
Minister S Savitha
Chandrababu Naidu
Handloom Sector
Weaver Welfare
Financial Assistance
ఉచిత విద్యుత్
చేనేత పథకాలు
నేతన్నలకు మద్దతు
ఏపీ ప్రభుత్వం
వస్త్ర పరిశ్రమ
ఏపీ న్యూస్
Scroll for the next article