News1st Oct 04:48 PMSunil Byrisetty1 min read
‘నేతన్నల సేవలో’ లబ్ధిదారుల గుర్తింపు
రెండో విడత నేతన్నల సేవలో పథకం కింద ఆర్థికసాయం అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ
రెండో విడత నేతన్నల సేవలో పథకం కింద ఆర్థికసాయం అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు ఏడో తేదీ నుంచి నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. మొదటి విడతలో 71,536 మందికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. రెండో విడతలో ఆర్థిక సాయం అందించడానికి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గడువు సెప్టంబర్ 30వ తేదీతో ముగిసిందన్నారు. ఇంకా దరఖాస్తుల పరిశీలనతో పాటు, అర్హుల గుర్తింపు పూర్తి చేయాల్సి ఉండడంతో, గడువును వచ్చే నెల మూడో తేదీ వరకూ పెంచినట్లు మంత్రి సవిత తెలిపారు.